
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం చాలా నీచంగా చాలా దారుణంగా తయారయ్యాయి. జగన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్రా ప్రజలు పాతిక ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. మరి రాష్ట్రం బాగు పడాలంటే, బాగుండాలంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి ?, ఏం చేస్తే ఆంధ్రా ప్రజల జీవితాల్లో మళ్ళీ వెలుగులు వెదజల్లుతాయి ?. ఈ ప్రశ్న మొలిచిన ప్రతి మనసులో ఇప్పుడు ఒక్కటే పేరు వినిపిస్తోంది. ఆ పేరు చంద్రబాబు. మరీ నిజంగానే చంద్రబాబు నిజంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలడా ?. అసలు చంద్రబాబే మళ్ళీ ఎందుకు గెలవాలి ?, మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర సీఎంగా చంద్రబాబే ఎందుకు రావాలి ? చూద్దాం రండి.
చంద్రబాబుకు ప్రజలంటే భయం ఉంది..! ప్రజలంటే బాధ్యత. ప్రజల అభివృద్ధి అంటే ఆసక్తి ఉంది..! ప్రజల భవిష్యత్తు పట్ల దూరదృష్టి ఉంది..సహనం ఉంది…సంయమనం ఉంది.. ఎదుటివారి పట్ల గౌరవం ఉంది..! అందుకే బాబు గెలవాలి. అందుకే మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలి.
చంద్రబాబుకు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది..! సంక్షోభాలను సమయస్ఫూర్తితో అవకాశాలుగా మలుచుకునే చాకచక్యం ఉంది..!. అందుకే బాబు గెలవాలి. ఇక తుపానులు..వరదలు ..విపత్తులు సంభవించినప్పుడు ముఖం చాటేసి ఇంట్లో పడుకోకుండా.. ఎదురెళ్ళి పనిచేసే నిబద్ధత ఉంది..! అందుకే మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలి.
అన్నిటికీ మించి టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడాలన్న కోరిక ఉంది..! అందుకే బాబు గెలవాలి. అలాగే రాజకీయ కక్షలు..వ్యక్తిగత ద్వేషం..దుర్భాషలాడే వ్యక్తులను ఇగ్నోర్ చేసే నైజం ఉంది..! అందుకే మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలి.
రాజకీయాల్లో అనుభవం పెరిగే కొద్దీ సంక్షేమం.. అభివృద్ధి బ్యాలెన్స్ డ్ గా పనిచేసే పరిణితి పెరుగుతుంది. అందుకే బాబు గెలవాలి. చంద్రబాబుకు ఎదురైన అవమానాలు, అవహేళనలు.. అలాగే అపజయాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలు.. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మగౌరవం కాపాడుకునే పట్టుదల ఆయనలో ఉంది..! అందుకే అందుకే మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలి.
ముఖ్యంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఆయనలో వినయం ఉంది, విధేయత ఉంది, విశ్వసనీయత ఉంది..!. అదే విధంగా పరాజయము, పరాభవము, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన వ్యక్తిత్వం ఉంది. అందుకే, చంద్రబాబు గారిని ప్రజలు కావాలనుకుంటున్నారు. అందుకే బాబు గెలవాలి. అందుకే మళ్లీ సీఎంగా చంద్రబాబే రావాలి.













