
Highest Budget Movie:
సినిమాల ఖర్చులు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒకప్పుడు “టైటానిక్” సినిమాకోసం ఖర్చయిన రూ. 17,000 కోట్ల బడ్జెట్ ఆశ్చర్యపరిచేది. తర్వాత “అవెంజర్స్: ఎండ్‌గేమ్” తో అది రెట్టింపు అయింది – దాదాపు రూ. 30,000 కోట్లు! కానీ ఇప్పుడు అదే మార్వెల్ స్టూడియోస్… ఒక భారీ అడుగు వేసింది. “Avengers: Doomsday” అనే సినిమా కోసం రూ. 85,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా!
ఈ సినిమాలో మామూలు స్టార్లు కాదండి – క్రిస్ హేమ్స్‌వర్త్ (థోర్), టామ్ హిడిల్స్టన్ (లోకి), పెడ్రో పస్కల్ (మిస్టర్ ఫాంటాస్టిక్), ఇంకా… ఆశ్చర్యంగా అయితే చాలు – రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఉంటాడు! కానీ ఈసారి ఆయన హీరో కాదు… విలన్ Doctor Doom పాత్రలో!
ఈ సినిమాలో అవెంజర్స్, ఎక్స్-మెన్, ఫాంటాస్టిక్ 4, వకాండా వారియర్‌లు, న్యూ అవెంజర్స్… ఇలా అన్ని యూనివర్సులు కలుస్తాయి. ఈ సినిమాని ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్ దర్శకులు అయినా రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మూవీతో మార్వెల్‌కు లాభం వస్తుందా లేదా అనేది ఇంకా అనుమానమే. ఎందుకంటే మూవీకి తప్ప మరో కొన్ని వేల కోట్ల రూపాయలు మార్కెటింగ్, ప్రమోషన్ల కోసం ఖర్చవుతాయి. అంటే లాభం రావాలంటే, ఇది “ఎండ్‌గేమ్” లేదా “అవతార్” లా పెద్ద హిట్ అవ్వాలి. ఈ భారీ చిత్రం డిసెంబర్ 18, 2026 న ప్రేక్షకుల ముందుకు రానుంది.