HomeTelugu Trending‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ టీజర్‌

‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ టీజర్‌

WWW Movie Teaser

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ ఉత్కంఠభరితంగా ఉంది. విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని గుహన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా విజయవంతమై అందరికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాని కె.వి.గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి.పి.రాజు దాట్ల నిర్మాత. గురువారం ఈ చిత్ర టీజర్‌ను హీరో మహేష్‌బాబు విడుదలచేశారు. దర్శకుడు గుహన్‌ మాట్లాడుతూ ‘ఆన్‌లైన్‌ ద్వారా ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమగా మారింది? ఒకరినొకరు కలుసుకోవాలని అనుకునే క్రమంలో సైబర్‌ అటాక్‌ వారి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిందన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. మహేష్‌బాబు చిత్ర టీజర్‌ను విడుదలచేయడం ఆనందంగా ఉందని, చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu