యండమూరి సినిమా తీస్తున్నాడు!

ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ గతంలో చాలా చిత్రాలకు కథను సమకూర్చారు. అలానే కొన్ని సినిమాలను డైరెక్ట్ కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఏ సినిమాను తెరకెక్కించలేదు. చాలా గ్యాప్ తరువాత మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అయితే అది తెలుగు సినిమా కాదు.. కన్నడంలో ఆయన సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. కరిగంబలియల్లి మిడినాగ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ ముస్లిం కుర్రాడి ప్రేమలో పడే ఓ హిందూ యువతి కథే ఈ సినిమా. పూర్తి ఉగ్రవాద నేపధ్యంలో నడిచే కథ. యండమూరి రచించిన చాలా నవలలు, పుస్తకాలు కన్నడంలోకి అనువదించారు. అక్కడ కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలనే అక్కడ కూడా సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో నటుడు నవీన్ తీర్ధహల్లి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యండమూరితో పాటు రచయిత యతీరాజ్ వీరంబుది కూడా ఈ సినిమాకు రచనా సహకారం అందించనున్నారు.