కౌశల్‌ ఆర్మీ ట్రోల్స్ గురించి నానిపై సుమ పంచ్

బిగ్‌బాస్‌లో రెండు వారాల క్రితం కౌశల్‌పై నాని పైర్ అయినప్పటి నుంచి కౌశల్ అభిమానులు నానికి వ్యతిరేకంగా ట్వీట్‌లు చేయడం తెలిసిందే. హౌస్‌లో కౌశల్ బూతులు మాట్లాడారంటూ, అలాగే ఇంటి సభ్యులు ఎవరూ ఇంటి నిమయాలను పాటించడం లేదంటూ బిగ్‌బాస్ కూడా మండి పడటం కౌశల్ అభిమానులకు నచ్చలేదు. అందుకే అప్పటి నుంచి కౌశల్‌ ఆర్మీ బిగ్‌బాస్‌ను, హోస్ట్ నానిని తిట్టిపోస్తూ ట్విట్టర్‌లో కామెంట్లతో నింపేస్తున్నారు.

గురువారం అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్‌బాస్ ఎఫెక్ట్ నాని, నాగార్జున కలిసి నటించిన దేవదాస్ సినిమాపై కూడా పడబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దేవదాస్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో సుమ మాట్లాడుతూ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో హోస్ట్‌గా చేస్తున్న నానిపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నట్వీట్లపై స్పందించింది. నానికి సపోర్ట్‌గా మాట్లాడుతూ తన వెర్షన్‌ను ఈ వేదిక మీదుగా వినిపించింది.

ముందుగా స్టేజ్‌పైకి నానిని ఆహ్వానించిన సుమ.. మీ కెరీర్ ఎలా ఉంది అని అడిగింది. నాని సమాధానం చెప్పే లోపే సుమ నాకు తెలుసు మీ జీవితం 3 ట్వీట్లు, 6 రీట్వీట్లతో వెలిగిపోతుంది. అయినా మీరేం చేశారు అందరూ మీమీద విరుచుకు పడుతున్నారు అంది. ఈ చిత్రం గురించి ఏమైనా చెప్పండి అంటూ.. వద్దు మీరు ఏమి మాట్లాడిన అది వైరల్ అవుతుంది. వాళ్లకు ఇష్టమొచ్చింది వాళ్లే రాసుకుంటున్నారు అని సుమ అంటూ మీరెళ్లి కూర్చోండి అంటూ నానిని స్టేజ్‌ కిందకు పంపించింది.

సాధారణంగా ఎప్పుడూ కౌశల్‌కు సపోర్ట్‌ చేసే నాని తాజా ఎపిసోడ్‌లో కౌశల్‌పై మండిపడ్డాడు. అయితే ఈ ఘటనపై కౌశల్‌ ఆర్మీ నానిపై మండిపడుతున్నారు. నాని కావాలనే కౌశల్‌ను టార్గెట్‌ చేస్తున్నాడని కౌశల్‌ను టైటిల్ గెలవకుండా చేయాలని నాని, బిగ్‌బాస్ టీమ్ ప్రయత్నం చేస్తున్నారని, అందుకే కౌశల్‌కు వ్యతిరేకంగా ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారంటూ కౌశల్‌ ఆర్మీ ట్వీట్లు చేస్తోంది. నాని నటించిన దేవదాస్‌ చిత్రంపై నెగిటివ్ టాక్ తీసుకొచ్చి ప్లాప్ చేయాలని కౌశల్ ఆర్మీ ప్లాన్ చేస్తోందట. దీంతో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాను కొన్న బయ్యర్లలో భయం పట్టుకుందట. బిగ్‌బాస్‌ కారణంగా నాని దేవదాస్ సినిమాపై ప్రభావం చూపిస్తున్న కౌశల్‌ ఆర్మీ పవర్‌ ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అందుకే నాని ఏమైనా మాట్లాడితే అది మరింత వైరల్ అయి సినిమాను టార్గెట్ చేస్తారనే నానిని స్టేజ్‌పైన మౌనంగానే ఉండాలని సుమ సూచనేమో. అందుకే తన సమాధానం కూడా తానే చెప్పి నానిని ఏమీ మాట్లాడకుండా చేసిందేమో.