పంచ పాత్రల్లో త్రిష..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవలే
నాయకి చిత్రంతో హారర్ సినిమాల్లో కూడా నటించగలనని ప్రూవ్ చేసింది. ఈ నేపధ్యంలో
వరుస హారర్ చిత్రాల్లో నటిస్తోంది. అలానే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించడానికి
ఒప్పుకుంది. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే..? ఇందులో త్రిష ఐదు పాత్రల్లో
కనిపించబోతోంది. అందులో రెండు పాత్రల్లో నాజూగ్గా కనిపించబోతోంది. దీని కోసం
త్రిష ఇప్పటినుండే బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ
ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇలవరసన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష ఈ సినిమా
కోసం కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates