
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ .. తాజాగా తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిపాడు. యశ్, రాధికల రెండో సంతానానికి ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా “యధర్వ్” అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ భాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో పచ్చని తోట మధ్యలో పూల పందిరి వేశారు. యశ్‌తోపాటు, యధర్వ్ ఇద్దరూ పంచె కట్టుకుని పూజలో పాల్గొన్నారు. తమ ఫాం హౌస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యశ్ కుమారుడిని చూసిన ఫ్యాన్స్ జూనియర్ రాకీ భాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ యశ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.













