HomeTelugu Reviews'యశోద' మూవీ రివ్యూ

‘యశోద’ మూవీ రివ్యూ

Yashoda Movie Review

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమానే ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి – హరీశ్ దర్శకత్వం వహించారు. ఈ రోజు ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్‌ల్లో విడుదలైంది.

కథ: యశోద (సమంత) ఒక మురికివాడలో తన చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. చెల్లెలికి ఆపరేషన్ చేయించడం కోసం ఆమెకి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసమే ఆమె ‘సరోగసి’కి ఒప్పుకుంటుంది. ఆ కారణంగానే ఆమె ఒక సాలెగూడులో చిక్కుకుంటుంది. ఆమె కడుపులో ఒక శ్రీమంతుల బిడ్డ పెరుగుతున్నదని చెప్పి ఒక విలాసవంతమైన సెంటర్ లో ఉంచుతారు. అక్కడ తనకి అన్నిరకాల వసతి సౌకర్యాలు కల్పించడం యశోదకి సంతోషాన్ని కలిగిస్తుంది.

తన మాదిరిగానే అక్కడ శ్రీమంతుల బిడ్డలను మోస్తున్నవారితో యశోదకి పరిచయమవుతుంది. అక్కడి వారి పర్యవేక్షణను మధుబాల (వరలక్ష్మి శరత్ కుమార్) చూసుకుంటూ ఉంటుంది. డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్)తో యశోదకి చనువు ఏర్పడుతుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ యశోదకి అక్కడివారి పనితీరుపై అనుమానం వస్తుంది. సరోగసి పేరుతో తమ చుట్టూ ఏదో జరుగుతోందనే సందేహం కలుగుతుంది.

Yashoda movie Review 1

ఇదే సమయంలో నగరంలో శ్రీమంతుల కుటుంబానికి చెందిన శివారెడ్డి, అతని ప్రియురాలు ఆరుషి కారు ప్రమాదంలో చనిపోతారు. కానీ అది పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్ అనే విషయం బయటపడుతుంది. ఆ కేసును ఛేదించడానికి కమిషనర్ బలరామ్ (మురళీశర్మ) ఆధ్వర్యంలో, వాసుదేవ్ (సంపత్ రాజ్) టీమ్ రంగంలోకి దిగుతుంది. పరిశోధనలో వారికి ఒక మిస్టీరియస్ డ్రగ్ దొరుకుతుంది. అదే విధంగా ప్రపంచంలోని పలు దేశాలలోని శ్రీమంతుల కుటుంబానికి సంబంధించిన ఆడవారు, దాదాపు ఒకే సమయంలో ఇండియాకి వచ్చి వెళుతున్నారనేది సంపత్ రాజ్ టీమ్ కి తెలుస్తుంది.

నటీనటులు: ఈ సినిమాలో యశోద పాత్రలో సమంత ఒదిగిపోయింది. ఒక గర్భిణీ స్త్రీగా ఆమె నటన చాలా సాహజంగా ఉంది. ఇక యాక్షన్ సీన్స్ లోను సమంత అదరగొట్టింది. కళ్లతో .. కరకు మాటలతో వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజాన్ని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఉన్ని ముకుందన్ తనకి ఇచ్చిన పాత్రను చాలా నీట్ గా చేశాడు. రావు రమేశ్, మురళీశర్మ వంటి ప్రధానమైన పాత్రలను దర్శకులు తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: ఇండోర్ లో సమంత అన్వేషణ .. అవుట్ డోర్ లో సంపత్ రాజ్ టీమ్ విచారణ మొదలవుతుంది. తన చుట్టూ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడానికి ‘యశోద’ ఏం చేస్తుంది? అప్పుడు ఆమెకి తెలిసే భయంకరమైన నిజాలు ఏమిటి? అక్కడి నుంచి బయటపడటానికి ఆమె చేసే ప్రయత్నాలు ఎలాంటివి? ఆరుషి మర్డర్ కేసుకు .. సమంత చిక్కుకున్న పరిస్థితులకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ.

Yashoda movie Review 2

దర్శకులు హరి – హరీశ్ ఇద్దరూ కూడా ఇంటర్నేషనల్ న్యూస్ ఐటమ్స్ ను ఆధారంగా చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నట్టుగా చెప్పారు. చివర్లో అందుకు సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా వేశారు. ఇంటర్వెల్ కి ముందు ట్విస్ట్ ఇచ్చి, ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచిన తీరు బాగుంది. సెకండాఫ్ లో మూడు నాలుగు అనూహ్యమైన ట్విస్టులతో కథ నడిపించారు. ‘యశోద’ ఒక కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్. ఈ కథలో ఎలాంటి డ్యూయెట్స్, రొమాన్స్ , కామెడీ గాని ఉండవు. కథాకథనాల పరంగా హరి – హరీశ్ మంచి మార్కులు కొట్టేస్తారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి సుకుమార్ అందించిన ఫొటోగ్రఫీ హైలైట్ అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలను బాగున్నాయి.

టైటిల్‌ : ‘యశోద’
నటీనటులు : సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్, మురళీ శర్మ తదితరులు
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: హరి-హరీష్
సంగీతం: మణిశర్మ

హైలైట్స్‌‌: సమంత నటన
డ్రాబ్యాక్స్‌: కొన్ని సన్నివేశాలు

చివరిగా: సమంత మరో నట విశ్వరూపం ‘యశోద’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!