HomeTelugu Trending'యాత్ర-2'లో చంద్రబాబు ఎవరో తెలుసా!

‘యాత్ర-2’లో చంద్రబాబు ఎవరో తెలుసా!

yatra 2 1
2019లో మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో విడుదలైన చిత్రం యాత్ర . ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ బయోపిక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ ‘యాత్ర 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌గా మమ్ముట్టి, వైఎస్ జగన్‌గా కోలీవుడ్ యాక్టర్‌ జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఇటీవలే హైదరాబాద్‌లో యాత్ర 2 షూటింగ్ షురూ అయింది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కథానుగుణంగా యాత్ర 2లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండబోతుందట. ఈ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్‌ ప్రకారం ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మహేశ్ మంజ్రేకర్‌ అయితే సీబీఎన్‌ పాత్రకు సరిగ్గా సరిపోతారని ఫిక్సయ్యాడట డైరెక్టర్‌.

yatra 2 update 1

అయితే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై మహి వి రాఘవ్‌ మహేశ్ మంజ్రేకర్‌ను సీబీఎన్ పాత్రలో ఎలా ప్రజెంట్‌ చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. యాత్ర 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!