డబుల్ రోల్ క్యారెక్టర్స్ లో విజయ్ ఆంటోనీ!

రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్‌ కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్స్‌ సాధిస్తున్న విజయ్‌ ఆంటోని తాజాగా ‘యమన్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జీవశంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారక క్రియేషన్స్‌ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి ‘యమన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌, యాక్షన్‌ ధ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జనవరి 25న హైదరాబాద్‌ రామానాయుడు ప్రివ్యూ ధియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ‘యమన్‌’ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా..

వి.వి. వినాయక్‌ మాట్లాడుతూ.. ”మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన ‘బిచ్చగాడు’ చిత్రం బిగ్‌ హిట్‌ అయింది. ఇప్పుడు ఫాదర్‌ సెంటిమెంట్‌తో విజయ్‌ ఆంటోని చేసిన ‘యమన్‌’ చిత్రం కూడా ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్‌ ఎవరైనా కథచెప్పినా అందులో కొంచెం బాగున్నా ఆ డైరెక్టర్‌కి అన్ని ఫెసిలిటీస్‌ కల్పించి ఎంకరేజ్‌ చేస్తారు. అందుకు విజయ్‌ ఆంటోనిని అభినందిస్తున్నాను” అన్నారు.

హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ”పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ క్యారెక్టర్స్‌ చేశాను. వెరీ ఎంటర్‌టైనింగ్‌ అండ్‌ కమర్షియల్‌ మూవీ. డైరెక్టర్‌ జీవశంకర్‌ నేను ‘నకిలీ’ చిత్రం చేశాం. అది మంచి హిట్‌ అయింది. మళ్లీ మేమిద్దరం ‘యమన్‌’ చిత్రం చేస్తున్నాం. ఈ చిత్రానికి డైరెక్షన్‌తో పాటు అద్భుతమైన ఫొటోగ్రఫి అందించారు జీవ. ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. నేనే మ్యూజిక్‌ చేశాను. త్వరలో ఆడియో రిలీజ్‌చేసి శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.