HomeTelugu News'యాత్ర'పై స్పందించిన విజయమ్మ

‘యాత్ర’పై స్పందించిన విజయమ్మ

13 5
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ చిత్ర యూనిట్‌ను వైఎస్ఆర్‌ సతీమణి విజయమ్మ అభినందించారు. ఈ చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆమె సోమవారం మాట్లాడుతూ… యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జ్ఞాపకాలను ‘యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్‌ సజీవంగా మనముందు లేకపోయినా… యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్‌ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్‌ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ‍్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా యాత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు మహి వి.రాఘవ, నిర్మాతలు దేవిరెడ్డి శశి, విజయ్‌ చిల్లా, శివ మేకా, వైఎస్సార్‌ పాత్రధారి హీరో మమ్ముట్టి, ఇతర చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!