ఆది పినిశెట్టి “నీవెవరో”

ఆదిపినిశెట్టి హీరోగా వస్తున్న తాజా చిత్రం “నీవెవరో” ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఇటీవలే రంగస్థలం సినిమాలో కుమార్‌ బాబుగా ఆది పినిశెట్టి అలరించారు. తాప్సీ, రితికా సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్స్, ఎంవీవీ సినిమా సమర్పణలో కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న “నీవెవరో” చిత్రం పెద్ద హిట్ అవుతుందని కొరటాల అన్నారు. వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడంలో కోన ఫిలిమ్స్, ఎంవీవీ సినిమా బ్యానర్‌లు ముందుంటాయని అన్నారు. ఈ చిత్రం థ్రిల్లర్ హిట్ అవుతుందని అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అని కొరటాల అన్నారు. హీరోగా ఆది పినిశెట్టికి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులను థ్రిల్లింగ్ చేస్తుందని నిర్మాతలు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది.