ఐసీయూలో తమిళ స్టార్‌ విజయకాంత్‌..!

తమిళ నటుడు, డిఎండికె అధినేత కెప్టెన్ విజయకాంత్ ప్రస్తుతం చెన్నై పొరూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8 ఎనిమిది గంటల ప్రాంతంలో ఆరోగ్యం సరిగా లేనందున ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా, ప్రస్తుతం వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారట.

ప్రస్తుతం ఆయన వెంట భార్య లత, కుమారుడు ఉన్నారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. తమిళ పరిశ్రమ రెండవ తరం స్టార్ హీరోల్లో ఒకరైన కెప్టెన్ విజయకాంత్ ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేశారు.