ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నాడు. కన్నడ హీరోయిన్‌ రష్మిక మందనతో కలిసి నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం ప్రమోషన్‌లో మనోడు కాస్త వెరైటీగా పాల్గొంటున్నాడు. వీరిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్‌నే విడుదల చేశారు

 

‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌’ అంటూ పోస్టర్‌ను ఉంచాడు. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌’ మేడమ్‌.. అంటూ గోవిందం(విజయ్‌).. గీత(రష్మిక)ను కోపంగా చూస్తున్నాడు. పరుశురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గీత గోవిందం. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం విజయ్‌ నటించిన టాక్సీవాలా, నోటా చిత్రాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి త్వరలోనే విడుదలకు సిద్ధమౌతున్నాయి