చరణ్‌ 12 వ చిత్రంలో రకుల్‌ ఐటమ్‌ సాంగ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ తేజ్ సినిమాలు చేయడమే బాగా స్లో. ప్రస్తుతం బోయపాటితో రూపొందుతున్న మూవీ మెగాపవర్ స్టార్ కెరీర్ లో 12వ చిత్రం. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు గడిచిపోయినా.. ఇప్పటికి చేసినవి 11 సినిమాలు మాత్రమే…వీటిలో నాలుగు సినిమాల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డుకు కాసింత చేరువ అవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే బ్రూస్ లీ.. ధృవ చిత్రాలలో రామ్ చరణ్ తో కలిసి నటించిన రకుల్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఈ హీరోతో చిందేస్తోందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ హీరోగా రూపొందుతున్న చిత్రం కోసం.. ప్రస్తుతం ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ పాటలో క్రేజీ హీరోయిన్ ను ఐటెం భామగా చూపించాలని మేకర్స్ భావిస్తుండగా.. మొదటగా రకుల్ ప్రీత్ నే అప్రోచ్ అయ్యారని అంటున్నారు.

చరణ్ తో రెండు సినిమాల్లో నటించిన రకుల్ కు ఈ విషయంలో అభ్యంతరాలు ఉండే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు కరువయిపోయాయి కూడా. అయితే రామ్‌ చరణ్‌ తో ఐటం సాంగ్‌ చేసి తెలుగులో వరుస అవకాశలు సంపాదించాలని చూస్తుంది రకుల్‌. కోలీవుడ్ లో ఛాన్సులు బాగానే ఒడిసిపట్టుకుంటోంది కానీ.. తెలుగుకు వచ్చేసరికి వెంకటేష్-నాగచైతన్య మల్టీస్టారర్ లో లో మాత్రమే యాక్ట్ చేస్తున్న రకుల్ కు.. చెర్రీ మూవీతో జోష్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఫొటో షూట్స్‌ తో ఈ అమ్మడు సెగలు రేపుతోంది.