చికాగో సెక్స్‌ రాకెట్‌…నటి వీసా తిరస్కరణ!

చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం అటు అమెరికా తెలుగు సంఘలపై ఇటు టాలీవుడ్‌ పై తీవ్ర ప్రభావం చూపింస్తోంది. అమెరికా తానా అధ్యక్షుడు సతీష్ వేమనను కూడా అధికారులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై అమెరికాలో జరగబోయే ఈవెంట్లకు హాజరు కాబోయే హీరోయిన్లకు – నటీనటులకు ఇక్కట్లు తప్పేలా లేవు. తాజాగా అమెరికాలోని ఓ ఈవెంట్ కు హాజరయ్యేందుకు టీవీ నటి సురేఖా వాణి చేసుకున్న వీసా దరఖాస్తును యూఎస్ కాన్సులేట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం యూఎస్ కాన్సులేట్ కు వెళ్లిన సురేఖాకు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు వచ్చేనెలలో జరగబోతోన్న ఓ ఈవెంట్ కోసం కూడా తెలుగు అసోసియేషన్ వారికి వీసాలను యూఎస్ కాన్సులేట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లోని నటీనటులపై చికాగో సెక్స్ రాకెట్ ప్రభావం పడింది. ఎప్పటిలాగే రకరకాల ఈవెంట్లలో పాల్గొనేందుకు నటీనటులను – హీరోయిన్లను తెలుగు అసోసియేషన్లు ఆహ్వానిస్తున్నాయి. అయితే వారి వీసాలను యూఎస్ కాన్సులేట్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న అమెరికా వెళ్లేందుకు బీ1బీ2 (ట్రావెల్ వీసా) వీసా కోసం సురేఖా వాణి యూఎస్ కాన్సులేట్ కు ఇంటర్వ్యూ కోసం వెళ్లారట. తాను `ఆటా` సదస్సు కోసం అమెరికా వెళ్తున్నానని చెప్పగానే ఆమె వీసాను తిరస్కరించారట. సురేఖతోపాటు ఆ సభలకు హాజరుకావాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేక మహేందర్ రెడ్డి వీసా దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది.

వీటితోపాటు ‘తానా’ ‘ఆటా’ ‘నాటా’ వంటి తెలుగు అసోసియేషన్లు నిర్వహించే సదస్సుల పేరు చెబితే వీసా పై’రిజక్టెడ్’ స్టాంప్ వేసేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆ సభల ఇన్విటేషన్ కార్డుతోపాటు – ఆర్థిక స్థితిగతులు బాగుంటే వీసా ఇచ్చవారని….చికాగో సెక్స్ రాకెట్ తర్వాత అందరినీ అనుమానించి వీసాలు మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. తమ సదస్సులకు మరింత ఆకర్షణ తెచ్చేందుకు హీరోయిన్లను నటీనటులను ఆహ్వానిస్తున్నామని వేరే కారణం లేదని చెప్పినా అధికారులు వినడం లేదట. దీంతో కిషన్ దంపతులపై తెలుగు అసోసియేషన్లు మండిపడుతున్నాయి. భవిష్యత్తులో జరిగే ఈవెంట్లకు నటీనటులు సెలబ్రిటీలను ఎలా అమెరికా తీసుకువెళ్లాలని ఆందోళన పడుతున్నాయి. అయితే కొందరు చేసిన తప్పుకు అందరినీ ఇలా అడ్డుకోవడం సరికాదని ఇండస్ట్రీ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.