తల్లి కాబోతున్న ప్రభాస్‌ హీరోయిన్‌

టాలీవుడ్‌లో ‘లీడర్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు తమిళ, బెంగాలీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో కుర్రకారుల మనసు దోచింది బేబీ డాల్‌. 2013లో సినిమాలకు స్వస్తి పలికింది రిచా.

2019 డిసెంబర్‌లో అమెరికాలోని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు జో లాంగేల్లాను పెళ్లాడింది. తాజాగా ఆమె తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కొంతకాలంగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాం. కానీ ఇప్పుడు మీ అందరితో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. జో, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జూన్‌లో బేబీ లాంగేల్లా రాబోతోంది. ఆ క్షణం కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. రిచాకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/p/CL0nYqwnTCk/?utm_source=ig_web_copy_link

CLICK HERE!! For the aha Latest Updates