‘చినబాబు’ మూవీ ట్రైలర్‌

కార్తి హీరోగా తమిళంలో నటించిన చిత్రం ‘కడైకుట్టి సింగం’ తెలుగులో ‘చినబాబు’ టైటిల్‌తో తెరకెక్కించారు. అన్నయ్య సూర్య నిర్మాణంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయేషా, ప్రియా భవాని శంకర్‌లు కథానాయికలు.ఈ సినిమాను రెండు భాషల్లోనూ ఈ నెల 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్నికి పసంగ పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా తాజాగా తెలుగులో చినబాబు ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ ‘రైతుల జీవితం ఆధారంగా రూపొందించిన కుటుంబ చిత్రమిది. వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఇందులో ప్రస్తావించాం. ఇందులో ఒక రైతు మాదిరిగానే తమ్ముడు కార్తి మారిపోయారు. ఎప్పటి నుంచో దర్శకుడు పాండిరాజ్‌ ఈ సినిమాను చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికి ఆ కల నెరవేరింది. ఈ చిత్రంతో రైతుల మనోభావాలను తెలియజేస్తున్నాం. ఈ సినిమాను రైతులకు అంకితం ఇస్తున్నాం. తప్పకుండా మా బ్యానరుకు ‘చినబాబు’ మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందని’ పేర్కొన్నారు.