నా స్నేహితులకు చేదు వార్త

‘బిగ్‌ బాస్‌’-2… స్టార్‌ మా టీవి ఛానల్లో రేపటినుంచి ప్రారంభంకాబోతుంది. ఈ షోకి నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. 16మంది సెలబ్రెటీలు 100 రోజుల పాటు ‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో ఉండబోతున్నారు. దాంతో బుల్లితెర ప్రేక్షకులంతా ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ ఈ షోలో శ్రీరెడ్డి పాల్గొంటున్నదని వార్తలు వచ్చాయి.

అయితే శ్రీరెడ్డి వాటిని స్వయంగా ఖండించింది. తాను ఈ షోలో పాల్గొనడంలేదని తాజాగా శ్రీరెడ్డి తేల్చి చెప్పింది. ”ఇది నా దురదృష్టం.. నా స్నేహితులకు చేదు వార్త.. నేను ‘బిగ్‌ బాస్‌2′ లో చేయడం లేదు . ఇది నా సన్నిహితులను అప్సెట్‌ చేసినా, కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పోటిదారులు అదృష్టవంతులు..’బిగ్‌ బాస్‌2’ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ ” అని ఆమె ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేసింది.