ప్రభాస్ సినిమాకు సైన్ చేసింది!

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో యూత్ అందరినీ తనవైపు తిప్పుకొని ఇండస్ట్రీలో వరుస అవకాసాలను సంపాదిస్తోంది పూజాహెగ్డే. స్టార్ హీరోల సినిమాలను టార్గెట్ గా పెట్టుకున్న ఈ బ్యూటీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఛాన్సులు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తోన్న పూజా త్వరలోనే ఎన్టీఆర్, అలానే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జత కట్టబోతుంది. ఇప్పుడు నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ తో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే సినిమాను ప్రారంభించి జులై నెలలో షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.