‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్ 2 టైటిల్ విడుదల!

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా సినిమా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా పార్ట్‌-1 టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. అయితే పార్ట్ 2 టైటిల్ ను మూవీ యూనిట్ కొద్దీ సేపటి క్రితమే ప్రకటించింది. మొదటి పార్ట్ కు కథానాయకుడు టైటిల్ కాగా, సెకండ్ పార్ట్ కు మహానాయకుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు సెకండ్ పార్ట్ సినిమాను జనవరి 24, 2018 న రిపబ్లిక్ డే పర్వదినం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణే స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.