ప్లాస్టిక్‌ నిర్మూలనకు తారల ప్రయత్నం

నేడు వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ డే సందర్భంగా బాలీవుడ్‌ నటి దియా మీర్జా మరో ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దేశ పర్యావరణాన్ని ప్లాస్టిక్‌ ఏ స్థాయిలో నాశనం చేస్తుందో అనే అంశాన్ని వివరిస్తూ ఒక ఫొటో పోస్ట్‌ చేశారు. అందులో ఇతర నటీనటులు కూడా భాగమయ్యారు.

ప్లాస్టిక్‌ ను తగ్గించాలని ఇచ్చిన పిలుపునకు బాలీవుడ్‌ తారాగణం కూడా మెల్లగా కదులుతోంది. బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కూడా ప్లాస్టిక్‌ ని నిర్మూలించాలని అది భూమిలో విలీనమయ్యేందుకు 450 ఏళ్లు పడుతుందని వివరిస్తూ..స్టీల్‌ బాటిల్‌ ను వాడాలని తన చేతిలో స్టీల్‌ బాటిల్‌తో సెల్ఫీ తీస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అలాగే అర్జున్‌ కపూర్‌ కూడా ఓ సెల్ఫీతో అభిమానులను ఆకర్షించగా సీనియర్‌ హీరోయిన్‌ జుహీ చావ్లా కూడా తనదైన శైలిలో మెస్సేజ్‌ ఇచ్చింది.