‘గౌతమ్ నంద’ గా గోపీచంద్!

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. “గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాం. బియర్డ్ లుక్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సంపత్ నంది ఆయన పాత్రను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 24న హైద్రాబాద్ లో మొదలుకానుంది. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతాం.  మార్చ్ లో పాటల్ని విడుదల చేసి.. ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు