బిగ్‌బాస్‌లో మొదలైన మసాలా

బిగ్‌బాస్‌లో నాని చెప్పిన మసాలా మొదలైపోయింది. మొదటి వారం ప్రశాంతంగా నడిచినా రెండోవారం చివరిలో శుక్రవారం ప్రసారమైన షో చాలా రసవత్తరంగా సాగింది ఒకరిపై ఒకరు మండిపడ్డారు. కెప్టెన్‌కి ఇంటిసభ్యుల మధ్య పెద్ద గందరగోళం జరిగింది. ఫుడ్‌ విషయంలో నువ్వంటే నువ్వు అని ఒకర్ని ఒకరు దూషించుకున్నారు. నూతన్‌ నాయుడు, తనీష్‌ కొట్టుకునే వరకు వచ్చారు. తనీష్‌ నువ్వు నోర్ముయ్… నేను గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని నూతన్‌ అన్నాడు.

వీరిద్ధరి మధ్య పెద్ద రణరంగమే జరిగింది. ఇంటిలో తనీష్ హీరోయిజం చూపించాడు. సభ్యులందరు రెండు టీమ్‌లుగా వీడిపోయి ఈ సంఘటనపై చర్చలు జరిపారు. ఈ సంఘటనల మధ్య నెక్ట్స్ కెప్టెన్‌ పోటీలు మొదలయ్యాయి. ఇందులో అమిత్‌, తనిష్, కౌషల్‌ కెప్టెన్‌ టాస్క్‌లో కౌషల్-కిరీటి మధ్య గొడవ జరిగింది. కౌషల్‌ గురించి కిరీటి తప్పుడు ప్రచారం చేశాడు. దానిపై కౌషల్ రియాక్ట్ అవుతూ ఆడపిల్లలపై అక్కడా.. ఇక్కడా చేతులేసుకొని తిరగడానికి నేను నీ టైపు కాదు.. ముందు నీవు ఆడపిల్ల మీద చేతులేయకుండా మాట్లాడు అన్నాడు.