రాజమౌళి ముందే చెప్పాడట!

బాహుబలి2 సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో పార్ట్1 కూడా రిలీజ్ చేస్తే బావుంటుందని బాహుబలి టీం ప్లాన్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో పార్ట్ 1 సినిమాను రిలీజ్ చేశారు. నిజానికి పార్ట్1 రీరిలీజ్ చేయడం రాజమౌళికి అసలు ఇష్టం లేదట. ఏదో బాహుబలికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఫీలింగ్ అందరిలో కలుగుతుందని చెప్పారట. కానీ కరణ్ జోహర్ మాత్రం సినిమాకు క్రేజ్ ను బట్టీ రీరిలీజ్ చేయడంతో ఎలాంటి తప్పు లేదని వాదించాడట. అంతేకాదు దానికి కావల్సిన అన్ని ఖర్చు తనే భరిస్తానని చెప్పడంతో రాజమౌళి కాదనలేకపోయారు.
 
తీరా సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో కలెక్షన్స్ చూసుకుంటే కోటి రూపాయల గ్రాస్ కూడా దాటలేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఆడియన్స్ లేక షోలు కూడా వేయలేదని సమాచారం. కానీ థియేటర్స్ ను బుక్ చేసుకున్న కారణంగా వాటికి రెంట్లు కట్టడం తప్పలేదు. ఇప్పటికే టీవీల్లో అనేకసార్లు ఈ సినిమాను ప్రసారం చేశారు.. మార్కెట్ లో కూడా డివిడిలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలో సినిమాను రీరిలీజ్ చేసి థియేటర్స్ కు రెంట్లు కట్టుకునే పరిస్థితిని తెచ్చుకోవడం ఓ రకంగా బాహుబలి టీం కు చెడ్డ పేరును తీసుకొచ్చింది.