విజయేంద్రప్రసాద్ కథను పక్కన పెట్టారు!

ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రచయితల్లో విజయేంద్రప్రసాద్ ఒకరు. ‘బాహుబలి’ సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, హిందీ వాళ్ళతో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీల జనాలు సైతం ఆయన వెంటపడుతున్నారు. అటువంటి రైటర్ తో కావాలని పట్టుబట్టి కథ రాయించుకొని ఇప్పుడు ఓ హీరో పక్కన పెట్టేయడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్.. ‘భజరంగి భాయిజాన్’ సినిమా చూసి ఫిదా అయిపోయి విజయేంద్ర ప్రసాద్‌తో ‘మేరా భారత్ మహాన్’ అనే సినిమాకు కథ రాయించుకున్నాడు.

కానీ ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టేశాడు సన్నీ. తన కొడుకు కరణ్‌ను హీరోగా పరిచయం చేయడానికే సన్నీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని టాక్. కొడుకును హీరోగా పెట్టి ‘పల్ పల్ దిల్ కే పాస్’ అనే సినిమాను తన దర్శకత్వంలో మొదలుపెడుతున్నాడు. ఈ కారణంగానే విజయేంద్రప్రసాద్ కథను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కథతో మరో హీరో ఎవరైనా.. సినిమా చేస్తారేమో చూడాలి!