మహేష్ సిస్టర్ తో సందీప్ కిషన్!

మహేష్ బాబు సోదరి మంజుల గతంలో ‘షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్’ వంటి సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అలాంటి మంజుల ప్రస్తుతం దర్శకత్వంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డైరెక్ట్ చేయబోయే సినిమాలో హీరోగా నాని నటిస్తాడని కొన్ని రోజుల క్రితం వార్తలు షికారు చేశాయి. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జెమిని కిరణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.

ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘నక్షత్రం’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతోన్న సందీప్ ఆ సినిమా పూర్తయిన వెంటనే మంజుల ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!