లోఫర్ భామకు జాకీ చాన్ అండ!

లోఫర్ భామకు జాకీ చాన్ అండ!
వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన ‘లోఫర్’ సినిమాలో నటించిన దిశా 
పటానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ధోనీ బయోపిక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 
ఈ భామ జాకీచాన్ తో కలిసి ‘కుంగ్ ఫూ యోగా’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. షూటింగ్ 
సమయంలో దిశా నటన నచ్చిన జాకీ చాన్ తనకు హాలీవుడ్ అవకాశాలు ఇప్పించడానికి 
ప్రయత్నిస్తున్నాడు. జాకీచాన్ నిర్మాణ సంస్థ వ్యవహారాలను చూసుకునే ఓ సంస్థకు దిశా 
పేరును సిఫార్సు చేశారట. దీన్ని బట్టి ఆమె త్వరలోనే హాలీవుడ్ తెరపై కనిపించే అవకాశాలు 
మెండుగా కనిపిస్తున్నాయి. ఇక జాకీ చాన్ చేస్తోన్న ఈ సహాయానికి అమ్మడు తెగ 
సంబరపడిపోతుంది. ఓ గురువులా ఆయన నాకు సహాయం చేస్తున్నారని చెప్పుకుంటోంది. 
అతి తక్కువ సమయంలోనే హాలీవుడ్ కు వెళ్ళే హీరోయిన్ జాబితాలో దిశా పేరు
ముందుంటుంది.