HomeTelugu Big Storiesసైరా సెట్స్‌ కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

సైరా సెట్స్‌ కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా ప్రభుత్వం ఈ చిత్రానికి షాకిచ్చింది. ఈ చిత్రానికి మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ నిర్మిస్తున్నారు. రామ్‌ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ జరిగిన సెట్స్‌లోనే ప్రస్తుతం సైరా షూటింగ్‌ జరుగుతోంది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్ ఈ సెట్స్‌లో రంగస్థలం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభ్వుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్‌ నిర్మించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు.

1 1

ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అనుమతి తీసుకోకుండా సెట్‌ మూవీ యూనిట్‌ చేసిన తప్పని, అనుమతులు కోరితే ఉచితంగానైనా పర్మిషన్‌ ఇచ్చి ఉండేవారమని అధికారులు పేర్కొన్నారు. భూకబ్జాలకు ఇది ముందస్తు ప్లాన్‌ అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనుమతుల్లేకుండా సెట్ వేసి. ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేది చిత్ర యూనిట్‌ ప్రణాళికలో ఓ భాగమని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకనే ఆ సెట్స్‌ని కూల్చివేసినట్టు అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై సైరా చిత్ర యూనిట్‌ ఇంకా స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!