Homeతెలుగు Newsఅందరూ సమష్టిగా ఉండాలని జనసేన పిడికిలి గుర్తు: పవన్‌

అందరూ సమష్టిగా ఉండాలని జనసేన పిడికిలి గుర్తు: పవన్‌

ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (ఆదివారం) రాత్రి తణుకు‌లోని నరేంద్ర సెంటర్లో బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. పవన్‌కు ఘనస్వాగతం తెలిపిన ఆడపడుచులకు, న్యాయకులకు ధన్యవాలు తెలిపారు. దేవరకొండ బాల గంగాధర తిలక్‌ పుట్టిన ఊరికి రావడం ఆనందంగా ఉంది. దేవుడా నా ప్రజలను రక్షించు, అవినీతి పరులైన నేతల నుంచి కాపాడు అంటూ పవన్‌ బాల గంగాధర తిలక్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు. జనసేన పార్టీ పికిడిలి గుర్తు ఎందుకంటే అందరూ సమష్టిగా ఉండాలని జనసేన పిడికిలి చూపిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తారు.. అంటే ఒకటి తాను బాగుండాలని, రెండోది తన కుమారుడు లోకేష్‌ బాగుండాలని దాని అర్థం.

11a

మిగతా 8 వేళ్లు వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్నేహితులు, బంధువులు బాగుండాలని తప్ప ప్రజల బాగును ఎప్పుడూ కోరుకోరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైసీపీ అధినేత జగన్‌ రూ.లక్ష కోట్లు దోచారని టీడీపీ ఆరోపిస్తుంటే, వైసీపీ వాళ్లు చంద్రబాబు రూ.లక్షన్నర కోట్లు దోచారని విమర్మిస్తున్నారు తప్ప ఏమీ దోచుకోలేదని ఎవరూ చెప్పడం లేదుని అని వ్యాఖ్యానించారు. పోలవరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నామంటూ జనాలను బస్సుల్లో తీసుకెళ్లి, క్యాంటీన్‌లో భోజనాలు పెట్టేందుకు నెలకు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారని.. ఈ కాంట్రాక్టునంతా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడికి ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌ ఆరోపించారు. గోదావరి కాలువలను మురికిమయంగా మార్చారని ఆవేదన చెందారు. ఏ ప్రాంతనికి వెళ్లిన నిరుద్యోగమే, కులాల ఐక్యతకు జనసేన కృషి చేస్తుంది అని, నాకు కులం, మాతం లేదు పవన్‌ అన్నారు. పేదప్రజలపై టీడీపీ నేతలకు కనికరం లేదు, నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు.

10 9

నేను చంద్రబాబులా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదు, త్యాగమంటే లోకేష్‌కు ఏమి తెలుసు అన్నారు. వైసీపీ నాయకుడు అడ్డగోలుగా దోచేస్తే, టీడీపీ నాయకుడు చట్టబద్ధంగా దోచేస్తున్నారని ఆరోపించారు. దోపిడీలో వీరిద్దరికి తేడా లేదని పవన్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనమడిపై చూపించే ప్రేమలో కొంతయినా ఆంధ్రా బిడ్డలపై చూపించలేకపోతున్నారని విమర్శించారు. తాను డిగ్రీలు, పీహెచ్‌డీలు చేయకపోయినా ప్రజల కష్టాలు తెలిసినవాడినని తెలిపారు. అగ్రవర్ణాల పేదలకు కూడా వసతిగృహాలు నిర్మించి వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. గోదావరి జిల్లాల కాపులను తొమ్మిదో షెడ్యూలులో చేర్చి రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేస్తామని పవన్‌ హామీచ్చారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu