HomeTelugu Newsఅభిమన్యుడు నన్ను ఎంతో మెప్పించింది : మహేష్‌

అభిమన్యుడు నన్ను ఎంతో మెప్పించింది : మహేష్‌

విశాల్, సమంత జంటగా నటించిన చిత్రం ‘అభిమన్యుడు’. ఈ చిత్రానికి పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో ‘ఇరుంబు తిరై’ గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇటీవల ఈ సినిమా చూశానని తనను ఎంతో మెప్పించిందని అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు.

3 16

“అభిమన్యుడు” సినిమా నన్నెంతో మెప్పించింది. దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ ఈ సినిమా ద్వారా తన నైపుణ్యాలను ప్రేక్షకుడికి తెలియజేశారు. చక్కగా పరిశోధన చేసి ఈ సినిమా తీశారు. విశాల్‌కు, చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

“భరత్ అనే నేను” చిత్రంతో మంచి విజయం అందుకున్న మహేష్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘రాజసం’ ‘రైతుబిడ్డ’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ మీసం, గెడ్డంతో ఎప్పుడూ చూడని కొత్త గెటప్‌లో కన్పించనున్నట్లు తెలుస్తోంది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu