HomeTelugu Newsచరణ్‌ చేతుల మీదుగా 'నీవెవరో' ట్రైలర్‌

చరణ్‌ చేతుల మీదుగా ‘నీవెవరో’ ట్రైలర్‌

ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నీవెవరో’. ఈ చిత్రంలో తాప్సి, రితాకా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు హరినాథ్ దర్శకుడు. కోన వెంకట్‌ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అదే కంగల్‌ (అవే కళ్లు) సినిమా ఆధారంగా నీవెవరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా కామెడీ ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు.

9 20

ఈ ట్రైలర్‌లో తులసి..రితికా సింగ్‌ను పిలిచి..మీ నాన్నగారిని కూడా రమ్మనమ్మా..ఓ పెగ్‌ వేసి పోతారు.. అంటుంది. ఇందుకు పక్కనే ఉన్న శివాజీ రాజా.. పెగ్‌ వేస్తే నిజంగానే పోతారు అనడం ఫన్నీగా ఉంది. ఆది తన గురించి పోలీస్‌ అధికారి అయిన వెన్నెల కిశోర్‌కు చెప్తూ.. నా పేరు కల్యాణ్‌. హైదరాబాద్‌ నుంచి వచ్చాను అంటాడు. ఇందుకు కిశోర్‌.. నీ పేరు చెప్పడానికి హైదరాబాద్‌ నుంచి వచ్చావా.. అనడం నవ్వులు పూయిస్తోంది. నీకో విషయం తెలుసా..ఈ వంకతో నేను ఇవాంకాను కూడా కలవచ్చు అంటూ వెన్నెల కిశోర్‌ వేసే పంచ్‌లు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 24 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!