HomeTelugu Newsజమునకి కీర్తి సురేష్ కౌంటర్!

జమునకి కీర్తి సురేష్ కౌంటర్!

అసలు ‘మహానటి’ సినిమాను ఎలా తెరకెక్కిస్తారు..? నన్ను సంప్రదించకుండానే సావిత్రి జీవితాన్ని ఎలా రూపొందిస్తారని సీనియర్ నటి జమున చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వూలో సావిత్రి పాత్రలో నటించే అర్హత కీర్తిసురేశ్‌కు లేదని అన్నారు. దీనికి కాస్త ఆలస్యంగానే అయినా కీర్తిసురేశ్‌ ఘాటుగా స్పందించింది. తను పేర్కొంటూ సావిత్రి పాత్రలో నటించడానికి తాను అర్హురాలినేనని పేర్కొంది. తాను ఏమీ ఆలోచించకుండా సావిత్రి పాత్రలో నటించడానికి అంగీకరించలేదని, ఆమె గురించి క్షణంగా తెలుసుకున్న తరువాతనే ఆమెలా నటించడానికి అంగీకరించానని చెప్పింది.అందుకు చాలా శిక్షణ పొందానని చెప్పింది. k
ముందుగా సావిత్రికి సంబంధించిన పుస్తకాలను చదివానని, ఆ తరువాత సావిత్రి కూతురు ఛాముండేశ్వరిని కలిసి సావిత్రి మేనరిజం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పింది. అప్పుడు ఛాముండేశ్వరి తనకు చాలా విషయాలను చెప్పారని అంది. అదే విధంగా సావిత్రి నటించిన పలు చిత్రాలు చూశానని చెప్పింది. ఆ తరువాత ఆమెలా నటించడంలో శిక్షణ పొందానని, ఇవన్నీ దర్శక నిర్మాతలకు సంతృప్తిని కలిగించిన తరువాతనే ఆ పాత్రలో నటించడం ప్రారంభించానని తెలిపింది. అంతే కాదు చిత్రం విడుదలైన తరువాత తన నటన గురించి విమర్శించడం సబబుగా ఉంటుందని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!