HomeTelugu Big Storiesతెలుగు బిగ్‌బాస్‌‌లో కమలహాసన్‌

తెలుగు బిగ్‌బాస్‌‌లో కమలహాసన్‌

బిగ్‌బాస్‌‌-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. నిన్న గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఇంటిలోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెప్టెన్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యలకు డీజే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ వారం కెప్టెన్‌ పోటీదారులు పూజా రామచంద్రన్‌, సామ్రాట్‌, రోల్‌రైడా. కాగా వీరు ముగ్గురు డీజేలుగా వ్యవహరించాగా మద్దతుగా ఇంటి సభ్యులు వారి ముందు డ్యాన్స్‌ చేశారు. సామ్రాట్‌, పూజాలకు టై కావడంతో. బిగ్‌బాస్‌ మరో సాంగ్‌ ప్లే చేయడంతో మేజారిటీ సభ్యులు పూజాకు మద్దతివ్వడంతో ఆమె తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి సభ్యులు చిందేశారు. ముఖ్యంగా దీప్తి సునయన, శ్యామల, గీతా మాధురి, గణేశ్‌లు అదరగొట్టారు.. ఆఖరికి బాబుగోగినేని చేసిన డ్యాన్స్‌ ఫన్నీగా అనిపించింది.

7 2

ఇక ఎపిసోడ్‌ చివరిలో ఇంటిలోకి కమలహాసన్ ఎంట్రీ ఇచ్చారు, ఈ విషయాన్ని తెలియజేస్తూ బిగ్‌బాస్‌ నిన్న ఓ ప్రోమోను చూపించారు. ఈ సంఘటనతో ఆశ్చర్యాని గురైన ఇంటి సభ్యులు తమ అభిమాన హీరో కమలహాసన్ చూసి పులకించిపోయారు. కాళ్ల మీద పడుతూ తమ అభిమానం చాటుకుంటూ ఘనస్వాగతం పలికారు. అయితే ఇది ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. ఇక విశ్వరూపం 2 ఆడియో రిలీజ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కమలహాసన్‌.. ఆ చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్‌ కోసమే ఈ లోకనాయకుడు బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమలహాసన్‌ హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో బిగ్‌బాస్‌ 2 కి న్యాచురల్ స్టార్‌ నాని హోస్ట్‌ వ్యవహిరిస్తున్నాడు. అయితే కమలహాసన్ కలిసిన నాని ట్విటర్‌ వేదికగా ‘ఓ అభిమాని తన అభిమాన హీరోను కలుసుకున్నాడు.. జూనియర్‌ హోస్ట్‌.. సీనియర్‌ హోస్ట్‌ను కలిసాడు. అవును ఇది జరిగింది’ అని క్యాప్షన్‌తో కమల్‌హాసన్‌ తో దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు.

7a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!