HomeTelugu Newsత్వరలో సంజయ్‌దత్ "ప్రస్థానం"

త్వరలో సంజయ్‌దత్ “ప్రస్థానం”

తెలుగులో శర్వానంద్, సాయికుమార్ నటించిన ప్రస్థానం సినిమా రాజకీయ కథాంశంతో దర్శకుడు దేవాకట్టా రూపొందించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన ఇన్నేళ్లకు హిందీలో రీమేక్ కాబోతుంది. ఈ చిత్రంలో సాయి కుమార్ తన నటనకు ప్రాణం పోశారు. ఎన్నోఅవార్డులను, ఎంతోమంది విమర్శకుల ప్రశంసలను పొందింది. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.

3 8

సంజయ్‌దత్ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 1న ప్రారంభం కాబోతుంది. అదే రోజు తన తల్లి నర్గీస్ దత్ పుట్టినరోజు కూడా. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్రను సంజయ్‌దత్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్థానం సినిమా ఎప్పటి నుంచో రీమేక్ చేయాలని అనుకుంటున్నా ఇప్పటికి సమయం వచ్చింది. హిందీ రీమేక్ కూడా దేవాకట్టా దర్శకత్వంలోనే రూపొందబోతుంది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లుతెలుస్తోంది. ఈ చిత్రంలో అలీ ఫజల్, అమైరా దస్తూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!