HomeTelugu Big Storiesబాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడుతున్న'గీత గోవిందం'

బాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడుతున్న’గీత గోవిందం’

యువ నటుడు విజయ్‌ దేవరకొండ వరుస హిట్‌లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. అర్జున్‌రెడ్డి చిత్రంతో యూత్‌లో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న విజయ్‌ తాజాగా విడుదలైన ‘గీత గోవిందం’ తో భారీ విజయం అందుకున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలకు కొద్దిరోజుల ముందు పైరసీకి గురైనప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి టాక్‌ అందుకుంది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో పోటీ పడి అగ్రస్థానంలో ఉంది.

8 17

గీత గోవిందం చిత్రం విడుదలైన రోజే అక్షయ్‌ కుమార్‌ నటించిన గోల్డ్‌ జాన్‌ అబ్రహం నటించిన సత్యమేవ జయతే చిత్రాలు విడుదలయ్యాయి. ఆస్ట్రేలియాలో ‘గోల్డ్’, ‘సత్యమేవజయతే’ చిత్రాలు 192,306 ఆస్ట్రేలియన్‌ డాలర్ల వసూళ్లు రాబడితే.. ‘గీత గోవిందం’ 202,266 ఆస్ట్రేలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టి ఆ రెండు చిత్రాలను బీట్‌ చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రెండు బాలీవుడ్‌ చిత్రాలను దక్షిణాది చిత్రం బీట్‌ చేసిందని పేర్కొన్నారు.

పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్‌ సరసన రష్మిక కథానాయిక నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం విజయోత్సవ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. మరోపక్క ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!