HomeTelugu Big Storiesరాష్ట్ర జీఎస్‌టీ చిన్న సినిమాలకు మినహాయింపు

రాష్ట్ర జీఎస్‌టీ చిన్న సినిమాలకు మినహాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ… చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సినిమాలకు అండగా ఉండాలని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

11 15

రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో ..రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయాలనే నిబంధన పెట్టామన్నారు. వాణిజ్య పన్నులశాఖ లెక్కల ఆధారంగా రీఎంబర్స్‌ చేస్తామని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాలపై తీసిన 10 చిన్న సినిమాలకు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. సినిమా థియేటర్లు కొందరి చేతిలోనే ఉన్న విషయం వాస్తవమేనన్నారు.

11a 2

రాష్ట్రంలో సినిమా చిత్రీకరణపై నటులు సానుకూలంగా స్పందిచారని అంబికా కృష్ణ తెలిపారు. చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ వల్ల సినీరంగం తీవ్రంగా నష్టపోతుందని అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటుగా తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu