HomeTelugu Newsవర్మ నెక్స్ట్‌ మూవీ 'భైరవగీతం'

వర్మ నెక్స్ట్‌ మూవీ ‘భైరవగీతం’

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. ‘భైరవగీతం’ అనే సినిమాకు తను నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

8 9

శనివారం రాత్రి జరిగిన (2018) ఫిల్మ్‌ఫేర్‌ వేడుకలో ధనంజయ ఉత్తమ నటుడు (కన్నడ-క్రిటిక్)‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టు వివరాలను ప్రకటించినట్లు వర్మ సోషల్‌మీడియా వేదికగా చెప్పారు. ఇందులో ధనంజయ ‘భైరవ’ అనే పాత్రలో కనిపించనున్నారని పేర్కొన్నారు. ఇది ఓ ప్రేమకథ అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ఎలా రెబల్‌‌గా మారాడన్నదే కథ అని చెప్పారు. ఈ సినిమాను నూతన దర్శకుడు సిద్ధార్థ్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తనతోపాటు భాస్కర్‌ రశీ సినిమా నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu