HomeTelugu Newsకౌశల్‌లోని నెగిటివ్ క్వాలిటీస్ బయటపెట్టిన హౌస్‌మేట్స్

కౌశల్‌లోని నెగిటివ్ క్వాలిటీస్ బయటపెట్టిన హౌస్‌మేట్స్

తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్న బిగ్‌బాస్-2 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ మొత్తం 16 మంది సభ్యుల్లో ఇప్పటికి ఏడుగురు ఉన్నారు. ఈ ఆదివారం నాటి 99వ ఎపిసోడ్‌ “నీ మంచికోరి”అనే సరదా సరదా టాస్క్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌గా నడిచింది. ఈ టాస్క్‌లో భాగంగా తమ తోటి పోటీదారుల్లోని నెగిటివ్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటే బావుంటుందని భావిస్తారో అలాంటి నెగిటివ్ పదాలు ఆరింటిని సూచించాలని తెలుపుతూ హోస్ట్ నాని తెలిపారు. ఆ సందర్భంలో కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు.

13 9

 

ఈ గేమ్‌లో భాగంగా.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద, కన్నింగ్, స్వార్థం, అత్యాశ, మాట మీద నిలబడక పోవడం, అహం, రెచ్చగొట్టడం లాంటి పదాలను సూచించారు. వీటిలో ఒకదానిని ఒక్కొక్క సభ్యుడు ఎంచుకుని తోటి సభ్యుడిలో వున్న ఆ నెగిటివ్‌ క్వాలిటీని తొలగించుకోవాలని ఎవరు భావిస్తున్నారో చెప్పాలి.

కౌశల్‌లోని నెగిటివ్ క్వాలిటీస్‌ అంటూ కన్నింగ్, అహం, అత్యాశ అనే పదాలను సెలెక్ట్ చేశారు. ఇక కౌశల్ కళ్లకు గంతలు కట్టి ఆయనలో ఈ లక్షణాలున్నాయని.. వాటిని తొలగించుకుంటే మంచిదంటూ వీటిని సూచించారు. కౌశల్‌ గురించి ఎవరు ఏమన్నారంటే.. అక్కడ ఉన్న పదాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి కాబట్టి.. కౌశల్ కన్నింగ్ అని తనీష్ ఎంచుకోగా.. కౌశల్‌కి స్వార్ధం అని రోల్ రైడా.. కౌశల్‌కి అత్యాశ అని దీప్తి నల్లమోతు, కౌశల్‌ మాట మీద నిలబడడు అని సామ్రాట్, కౌశల్ రెచ్చగొడతాడు అని అమిత్.. కౌశల్‌కి అహం ఎక్కువ అని గీతా మాధురి సెలెక్ట్ చేశారు.

13b

ఇక గీతా మాధురి గురించి.. నస, చాదస్తం, వెనుకచెడుగా మాట్లాడటం, నిర్లక్ష్యం, నోటి దురద లాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీప్తి నల్లమోతు గురించి ఫేక్‌గా ఆడటం, నస, అత్యుత్సాహం లాంటి నెగిటివ్ కామెంట్స్ రాగా.. ఈ “నీ మంచికోరి” టాస్క్‌లో దీప్తి నల్లమోతు అడిషనల్ షీట్ ప్రసంగాన్ని నానితో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తూనే ఆట పట్టించారు. ఆమె మొదలు పెడితే అసలు ఆపకుండా చేసిన సుదీర్ఘమైన ప్రసంగాలకు హౌస్ మేట్స్ పారిపోయారు. ఇది చాలా సరదాగా సాగింది

ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, గీతా, కౌశల్, అమిత్, కౌశల్‌లలో ముందుగా సేఫ్ అయ్యింది దీప్తి నల్లమోతు అని కాస్త రిలీఫ్ ఇచ్చారు నాని. ఇక మిగిలిన నలుగురిలో రెండో హౌస్ మేట్‌గా కౌశల్‌ని సేఫ్ చేశారు. మూడో హౌస్ మేట్‌గా గీతా.. నాలుగో హౌస్‌మేట్‌గా రోల్ రైడా సేఫ్ కావడంతో.. మిగిలిన అమిత్ ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చేశాడు.

13a

హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమిత్ తన తోటి సభ్యుల గురించి హోస్ట్ నానితో మాట్లాడుతూ తన దృష్టిలో ఫ్యామీలీ తప్ప ఇంకోక ప్రపంచం లేదని, కానీ బిగ్‌బాస్‌కు వచ్చిన తరువాత నాకు అంటూ..10 మంది ప్రెండ్స్‌ ఉన్నారు అని అన్నాడు. సౌకర్యాలు లేకుండా ఉండగాలం కానీ ఫ్యామీలీ లేకుండా ఉండలేం అని బిగ్‌బాస్‌లోకి వచ్చిన తరువాత నేర్చుకున్నాను. గీతా మాధురికి మంచి సెన్స్ ఉందని.. చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతుందని, సామ్రాట్ మిస్టర్ పర్ఫెక్ట్ అని అన్నారు. ఇక ఉన్నవారిలో టాప్ 3 ఎవరనే విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురిలు టాప్ 3 అన్నారు. బిగ్ బాస్ టైటిల్ రోల్ రైడా, సామ్రాట్‌‌లు గెలిస్తే బావుంటుందన్నారు. ఇక కౌశల్‌ ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తాడన్నారు. ఆయనలో కన్నింగ్ లక్షణాలు ఉన్నాయన్నారు.

ఇక ఎలిమినేట్ కంటెస్టెంట్‌కి సాంప్రదాయంగా వస్తున్ బిగ్ బాంబ్‌ను అమిత్ వెళ్తూ దీప్తి నల్లమోతుపై విసిరారు. దీని ప్రకారం హౌస్‌లో వారం రోజుల పాటు.. కంటెస్టెంట్స్ అందరి జట్టును దీప్తి మాత్రమే దువ్వాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu