మెగా కపుల్ చెర్రీ ఉపాసన ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి వెళ్ళలేదు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. జీవీకు, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఈ పాటికే ఈ పెళ్లి ఎవరిదనే విషయం అర్ధమైపోయిందనుకుంటా. ఈ పెళ్లి మరెవరిదో కాదు శ్రియా భూపాల్‌ది.

శ్రియా భూపాల్ ఈ పేరు మనందరికి పరిచయమే. జీవికే కుటుంబానికి చెందిన ఆమె…అక్కినేని కుంటుంబంలో చిన్న కోడలుగా అడుగుపెట్టబోయి..జెస్ట్ మిస్ అయిన సంగతితెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జరిగిన తర్వా చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దవ్వడం అప్పట్లో హట్ టాపిక్ అయింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు.
ఈసంఘటన తరువాత శ్రియా భూపాల్ వివాహం హీరో రాం చరన్ భార్య ఉపాసన కజిన్‌తో నిశ్చయించారు. తాజాగా ఈ పెళ్లి ప్యారిస్‌లో ఓ సిటిలో నిర్వహించినట్లు సమాచారం. ఈ పెళ్లికి రాంచరన్, ఉపాసన హాజరు అయ్యారు. వీరిద్దరు అక్కడ దిగిన ఫోటోను ఉపాసన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వీరిద్దరు కొత్త జంటలా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ కురిపించారు అభిమానులు.













