డబ్బింగ్‌ మొదలుపెట్టిన మహేశ్‌ ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. గురువారం సినిమా డబ్బింగ్‌ పార్ట్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మూవీలో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మహేశ్‌ పాత్ర పేరు రిషి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మహేశ్‌ 25వ సినిమాగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్‌, నరేశ్‌ గడ్డంతో విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర ఫిలింస్‌, వైజయంతి ఫిలింస్‌, పీవీపీసీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి మొదటి వారంలో టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.