Homeతెలుగు Newsశ్రీకాకుళంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

శ్రీకాకుళంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

72వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు సహకరించినా, సహకరించకపోయినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వ్యవసాయంపై శ్రద్ధ పెట్టామన్న చంద్ర బాబు.. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు తెచ్చామన్నారు. అభివృద్ధితోపాటు ఆనందంలో కూడా ఏపీ ముందుండాలని, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.

5 14

ప్రాజెక్టులు ముందుకు సాగకుండా విపక్షాలు అడ్డుపతున్నాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో రెండు అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కేంద్రంపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్న బాబు.. రాష్ట్ర హక్కులను పోరాడి సాధించుకుంటామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటున్నామని బాబు చెప్పారు. గత నాలుగేళ్లో కర్నూలు, విశాఖ, అనంతపురం, తిరుపతిలో నిర్వహించామని.. ఈసారి శ్రీకాకుళంలో జెండా పండుగ జరుపుకుంటున్నామన్నారు. విభజన కష్టాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu