కోలీవుడ్‌లో విలన్‌గా బాలీవుడ్‌ బాద్షా.?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా చేస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటనే విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో సినిమాలను పక్కన పెట్టి తన ఫ్రాంచైజీపై ఎక్కువ దృష్టి సారించారు. ఇదిలా ఉంటె, షారుక్ ఖాన్ తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ నెగెటివ్ రోల్ చేస్తున్నారట. 15 నిమిషాలపాటు షారుక్ రోల్ ఉంటుందని అది క్లైమాక్స్ లో షారుక్ కనిపిస్తారని తెలుస్తోంది. షారుక్ కు సంబంధించిన సీన్స్ ను త్వరలోనే షూట్ చేస్తారని సమాచారం. ఎక్కడ షూటింగ్ చేసింది త్వరలోనే యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానున్నది.