Homeతెలుగు Newsహరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ

హరికృష్ణకు నివాళులు అర్పించిన టీడీపీ

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌, హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ మృతిపై కళా వెంకట్రావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. చైతన్య రథ సారథిగా హరికృష్ణ 78 వేల కిలోమీటర్లు ఒక్క ప్రమాదం లేకుండా నడిపారని నేతలు గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ అందరికి తలలో నాలుకగా ఉండేవారని, తెలుగు యువత అధ్యక్షునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా హరికృష్ణ అందించిన సేవలు మరువలేనివని కళా వెంకట్రావు కొనియాడారు.

13 2

హరికృష్ణ నిరాడంబరంగా ఉండేవారని, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడమే హరికృష్ణకు మనం అందించే ఘనమైన నివాళి అని టీడీపీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. హరికృష్ణ మరణం రాజకీయ, సినీ రంగాలకు తీరని లోటని పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి తెలిపారు. పార్లమెంటులో తెలుగు భాషలో తొలిసారి మాట్లాడిన వ్యక్తిగా హరికృష్ణ గుర్తింపు పొందారని కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం రోజునే ఆయన చనిపోవడం బాధాకరమని చెప్పారు. హరికృష్ణ తనతో ఎంతో ప్రేమగా ఉండేవారని…, అన్నా అంటూ అప్యాయంగా పలకరించేవారని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ గుర్తుచేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu