చిరు సెంచరీ కొట్టాడు!

దాదాపు పదేళ్ళ గ్యాప్ తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కమ్ బ్యాక్ మూవీగా చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ఈరోజుకి వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర కూడా సందడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంతటి సంచలనాన్ని సాధించిన సినిమాగా ఖైదీ నెంబర్ 150 పేరు చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రనిర్మాత రామ్ చరణ్ కూడా ఈ సంధర్భంగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వంద రోజు సినిమా ఆడడం అనే కలను మళ్ళీ మెగాస్టార్ సినిమాతో వెనక్కి రప్పించడం గొప్ప విషయం అన్నారు. మీ అభిమానమే మరోసారి నేను నాన్నతో ప్రయాణం చేయడానికి కారణం అంటూ చిరు తదుపరి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మెగాస్టార్ కు ఉన్న క్రేజ్, వినాయక్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ స్థాయి విజయం రావడానికి కారణం అని అంటున్నారు.