HomeTelugu Big StoriesNC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..

NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..

Naga Chaitanya’s role in NC24 intrigues the fans!
Naga Chaitanya’s role in NC24 intrigues the fans!

NC24 Update:

అక్కినేని నాగచైతన్య తన 24వ సినిమాగా (NC24) విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ వర్మ డండు దర్శకత్వంలో వస్తున్న “వృష కర్మ” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై తాజా అప్‌డేట్స్ వస్తూ ఫ్యాన్స్ లో హైప్ పెరుగుతోంది.

ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో చైతూ ఒక ట్రెజర్ హంటర్‌గా నటిస్తున్నాడు. అతనికి జోడీగా ‘హిట్ 2’ ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది. ఆమె పాత్ర పేరు లక్ష్య, ఒక ఆర్కియాలజిస్ట్‌గా ఈ కథలో కీలకమైన పాత్రలో ఉండబోతోంది. ఇద్దరి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని టీం చెబుతోంది.

ఈ సినిమాలో కోసం చైతన్య తన బాడీ పరంగా బాగా ట్రాన్స్‌ఫార్మేషన్ అయ్యారు. తక్కువ గడ్డంతో, షార్ట్ హెయిర్‌స్టైల్‌లో కనిపించబోతున్నాడు. ఈ లుక్ త్వరలో విడుదల కానుంది. అభిమానులైతే ఇప్పటికే ఈ లుక్ గురించి చర్చలు మొదలుపెట్టేశారు.

ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు ‘సుకుమార్ రైటింగ్స్’ నుండి సుకుమార్ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సుకుమార్ స్క్రీన్‌ప్లే పర్యవేక్షణ కూడా చేస్తున్నారు.

ఇంకా, ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ బి లోక్నాధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చూస్తున్నారు, అంటే విజువల్స్ ఓ రిచ్ లెవెల్లో ఉంటాయన్నమాట.

ఇప్పటికే రెండు వారాల పాటు షూటింగ్ జరిగింది. మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. నాగచైతన్య మొదటిసారిగా మైథలాజికల్ జానర్‌లో నటిస్తుండటంతో, ఈ సినిమా పైన భారీ ఆసక్తి నెలకొంది.

ALSO READ: Arjun S/o Vyjayanthi OTT లో ఎక్కడ చూడచ్చంటే..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!