మ‌హేశ్ న్యూ లుక్‌

మ‌హేశ్ బాబు తాజాగా భర‌త్ అనే నేను సినిమాతో మంచి విజ‌యం సాధించారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరక్కిన ఈ
చిత్రం పొలిటిక‌ల్ ధ్రిల‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను బాగా అక‌ట్టుకుంది. ఇక మ‌హేశ్ తర్వాతి సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో
తెరకెక్కనున్న విష‌యం తెలిసిందే. మాములుగా మ‌హేశ్ లుక్ చాలా సింపుల్.. బ‌య‌ట ఎలా వుంటారో… సినిమాలోనూ
అలానే క‌నిపిస్తారు.. కానీ త్వ‌ర‌లో చేయ‌నున్న చిత్రంలో మీసంతో, గెడ్డంతో క‌న్పించనున్న‌ట్లు స‌మాచారం

ఇదే విష‌యాన్ని మ‌హేశ్ బాబు భ‌ర‌త్ అనే నేను ప్ర‌మోష‌న్ ఫంక్ష‌న్ లో కూడా చెప్పారు. మ‌రి ఈ కొత్త లుక్‌లో ఎంత‌సేపు
క‌నిపించ‌నున్నారో, లేదా సినిమా మొత్తం ఇలానే క‌నిపించానున్నారో తెలియాల్సుంది. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్లో 25వ
సినిమా కావ‌డంతో ప్రారంభం నుంచే అంచ‌నాలు పెరిగాయి. ఇప్పటికే భ‌ర‌త్ అనే నేను సినిమాలో మహేశ్ కాసేపు
మీసాల‌తో అల‌రించారు. రాయ‌ల‌సీమ బ్యాక్ గ్రౌండ్ తో తెర‌కెక్కనున్న మూవీ జూన్ నుండి సెట్స్ మీద‌కు రానుంది. పూజా
హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుండ‌గా, దిల్‌రాజు, అశ్విన్ ద‌త్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు.