HomeTelugu Trendingఘనత సాధించిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా..!

ఘనత సాధించిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా..!

2 23
బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ్య తాజాగా 50 మిలియన్లకు చేరింది. అటు హలీవుడ్‌తో పాటు ఇటు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. అయితే ఇన్‌స్టాలో 50మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రెండో భారతీయ సెలబ్రిటీగా ప్రియాంక ఘనత సాధించింది. ప్రియాంక కంటే ముందు 50.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో విరాట్‌ కోహ్లీ మొదటిస్థానంలో ఉన్నాడు. మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికకు 44.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ అవుతున్నారు. మూడేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ 15 ఏళ్లకే స్ఫూర్తిదాయక వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయేషా చౌదరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ప్రియాంక నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!