HomeTelugu Trending7G బృందావన కాలనీ సీక్వెల్‌.. హీరోయిన్ ఫిక్స్

7G బృందావన కాలనీ సీక్వెల్‌.. హీరోయిన్ ఫిక్స్

7G Brindavan sequel

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన సినిమా 7/G బృందావన కాలనీ (7G Brindavan Colony). రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఏఎం రత్నం నిర్మించిన 7G బృందావన కాలనీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌ సినిమాగా నిలిచిపోయింది. ఈ మూవీలో చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో 7G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.

రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా రూపొందిన 7/G బృందావన కాలనీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

Anaswar Rajan

7/G బృందావన కాలనీ సీక్వెల్‌లో హీరోగా మరోసారి రవికృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అనిత పాత్రలో జీవించిన చండీగడ్‌ భామ సోనియా అగర్వాల్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు సీక్వెల్‌లో అనిత పాత్రను ఎవరు చేయబోతున్నారనేదానిపై చర్చ నడుస్తోంది.

సీక్వెల్‌ షూటింగ్ సెప్టెంబర్‌ నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ సీక్వెల్‌లో అనిత పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అనస్వర రాజన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి పలు తమిళం, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనస్వర రాజన్ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu