ఆ జోకులకి బ్రహ్మీ కూడా నవ్వేశాడు!

ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మానందం హీరోగా నటిస్తూ… ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని,
అందులో హీరోయిన్స్ గా రేష్మి, అనసూయలు నటించనున్నారని రకరకాలుగా వార్తలు
వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసే త్రివిక్రమ్ అంటూ మరో రూమర్
వినిపించింది. ఈ విషయంపై ఎట్టకేలకు బ్రహ్మీ స్పందించారు. ”హీరోగా చేస్తున్నానడంలో నిజం
లేదు… త్రివిక్రమ్ తో మాట్లాడి చాలా కాలం అయింది.. ఆయన నిర్మాతగా వ్యవహరించడం
ఏంటో..? ఇవన్నీ వింటుంటే నాకే నవ్వొస్తుంది” అంటూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మీని
హీరోగా పెట్టి సినిమా చేయాలని దర్శకుడు రమేష్ వర్మ ప్రయత్నించాడు. కానీ హీరోగా నటించే
ఉద్దేశ్యమే తనకు లేదని బ్రహ్మీ ఆయన్ను తిరిగి పంపించేశారు. అంతేకాదు దర్శకత్వం గురించి
నాకు తెలియదు.. నన్ను నేను దర్శకుడిగా ఎప్పుడు ఊహించుకోలేదంటూ.. తన మనసులో
మాట చెప్పేశారు. మొత్తానికి ఇవన్నీ పుకార్లే అని తేలాయి.